తాతగారి పాత్ర కోసం హోమ్ వర్క్ చేశాను: సుమంత్
- క్రిష్ అడగ్గానే ఓకే అనేశాను
- తాతగారి సినిమాలు చూశాను
- ఈ పాత్ర కోసం బరువు తగ్గాను
" చాలా కాలం క్రితం నుంచే దర్శకుడు క్రిష్ తో నాకు ఎంతో సాన్నిహిత్యం వుంది. తాతగారి పాత్రను చేయమని క్రిష్ అడగ్గానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎంత మాత్రం ఆలోచించకుండా అంగీకరించేశాను. తాతగారు చేసిన సినిమాలు .. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు చూశాను. ఇమిటేషన్ కి .. యాక్టింగ్ కి మధ్యలో చేయడానికి ప్రయత్నించాను. తాతగారి పాత్రను చేయడం కోసం బరువు తగ్గడమే కాదు .. హోమ్ వర్క్ కూడా చేశాను" అని చెప్పుకొచ్చాడు.