సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కమల్ కోసం మేకప్ మారుస్తున్న కాజల్!
- నాగశౌర్యకు జోడీగా నిధి అగర్వాల్
- దిల్ రాజు సినిమాలో గోపీచంద్
* ఇటీవల 'సవ్యసాచి' చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ త్వరలో నాగశౌర్య సరసన నాయికగా నటించనుంది. దర్శకుడు సుకుమార్ నిర్మించే చిత్రంలో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తారని తెలుస్తోంది.
* త్రిష కథానాయికగా ఇటీవల తమిళంలో వచ్చిన '96' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన కీలక పాత్రను తెలుగులో యాక్షన్ హీరో గోపీచంద్ పోషిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.