మిస్టరీ థ్రిల్లర్ కి రానా వాయిస్ ఓవర్
- సుమంత్ హీరోగా 'సుబ్రహ్మణ్యపురం'
- ఆలయం నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 7వ తేదీన విడుదల
ఈ సినిమాలో అక్కడక్కడా వాయిస్ ఓవర్ ఉందట. సన్నివేశాలను కలుపుతూ సాగే వాయిస్ ఓవర్ ను ఎవరితో చెప్పించాలా అనే విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. అప్పుడు రానాతో చెప్పిస్తే బాగుంటుందని సుమంత్ సూచించడంతో, ఆయన ద్వారానే రానాను సంప్రదించడం జరిగిందట. సుమంత్ కోసం రానా చెప్పిన వాయిస్ ఓవర్ కథలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని అంటున్నారు. 'బాహుబలి'కి పనిచేసిన గ్రాఫిక్స్ టీమ్ ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ను అందించడం విశేషం.