సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- విజయ్ సరసన నయనతార
- ఏడు సినిమాల్లో నందిత శ్వేత
- 'ఆర్ఎక్స్ 100' దర్శకుడితో వర్మ
* ఇటీవల 'శ్రీనివాస కల్యాణం' చిత్రంలో హీరోయిన్ గా నటించిన నందిత శ్వేత ప్రస్తుతం తెలుగులో తాను చాలా బిజీగా వున్నట్టు చెప్పింది. తెలుగులో ఏకంగా ఏడు సినిమాలు ఒప్పుకున్నట్టు తెలిపింది. కొన్ని షూటింగు దశలో వుండగా, మరికొన్ని మొదలవుతాయని చెప్పింది.
* తాజాగా 'భైరవగీత' చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ త్వరలో మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తాడని వర్మ ప్రకటించారు.