మళ్లీ విలన్ గానే శంకర్ మూవీలో అక్షయ్ కుమార్
- శంకర్ నెక్స్ట్ మూవీగా 'భారతీయుడు 2'
- ముఖ్య పాత్రల్లో నయన్ .. కాజల్
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా సన్నాహాలు
శంకర్ తదుపరి సినిమాగా 'భారతీయుడు 2' నిర్మితం కానుంది. కమల్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో, విలన్ పాత్రకి గాను అజయ్ దేవగణ్ ను అనుకున్నారు. అయితే డేట్స్ సర్దుబాటు కాని కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి అజయ్ తప్పుకున్నాడట. దాంతో ఈ పాత్రను గురించి అక్షయ్ కి శంకర్ చెప్పడం .. ఆయన ఓకే అనడం జరిగిపోయాయని చెబుతున్నారు. నయనతార .. కాజల్ .. శింబు .. దుల్కర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.