‘సైరా’ మూవీ అప్ డేట్.. నయనతార మోషన్ టీజర్ విడుదల!
- నయన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్
- శుభాకాంక్షలు తెలిపిన సినిమా యూనిట్
- 2019, ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు
ఈరోజు నయనతార పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం ‘నయనతార మోషన్ టీజర్‘ను రిలీజ్ చేసింది. నయనతారకు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమాలో నయనతార పేరు ‘సిద్దమ్మ’గా ఉంటుందని వెల్లడించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.