బుల్లితెరపై కూడా నిరాశ పరిచిన 'అజ్ఞాతవాసి'
- బుల్లితెరపై త్రివిక్రమ్ సినిమాలకి క్రేజ్
- దీపావళి సందర్భంగా వచ్చిన 'అజ్ఞాతవాసి'
- ఆశించిన స్థాయిలో రాని రేటింగ్
బుల్లితెరపై త్రివిక్రమ్ సినిమాలకి మంచి క్రేజ్ వుంది. ఆయన సినిమాలు మంచి రేటింగ్ ను రాబడుతుంటాయి. అందువలన జెమినీ టీవీ వారు 19.5 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. ఈ దీపావళి కానుకగా ఈ సినిమాను మొదటిసారి ప్రసారం చేశారు. ఈ సినిమా భారీ రేటింగ్ తీసుకొస్తుందని భావించారు. కానీ ఈ సినిమాకి 5.3 టీఆర్పీ రేటింగ్ మాత్రమే దక్కింది. ఇలా జరగడం ఆ ఛానల్ వారికి పూర్తి నిరాశను కలిగించినట్టుగా తెలుస్తోంది.