ఉత్కంఠను రేపుతోన్న 'కేదార్ నాథ్' మూవీ ట్రైలర్
- కేదార్ నాథ్ వరదల నేపథ్యంలో ప్రేమకథ
- సుశాంత్ సింగ్ జోడీగా సారా అలీఖాన్
- డిసెంబర్ 7వ తేదీన విడుదల
సుశాంత్ సింగ్ కేదార్ నాథ్ లోని ఒక గైడ్ గా కనిపిస్తున్నాడు. ఆ క్షేత్రానికి వచ్చిన కథానాయికతో ఆయనకి పరిచయం ఏర్పడుతుంది .. అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ ఇద్దరి ప్రేమకి ఆమె తండ్రి అడ్డుగా నిలుస్తాడు. మరొకరితో ఆమె వివాహం జరిపించడానికి ప్రయత్నిస్తాడు. ఓ రోజు రాత్రి హఠాత్తుగా వరదలు కేదార్ నాథ్ ను ముంచెత్తుతాయి. ఆ వరదల బారి నుంచి నాయికను కాపాడటానికి హీరో ప్రయత్నించడం ఈ ట్రైలర్లో చూపించారు. డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.