నిధి అగర్వాల్ జోరు కొనసాగడం ఖాయమట!
- 'సవ్యసాచి'తో పరిచయమైన నిధి అగర్వాల్
- గ్లామర్ పరంగా మంచి మార్కులు
- పెరుగుతోన్న అవకాశాలు
చక్కని కనుముక్కుతీరుతో ఇట్టే ఆకట్టుకుంటోన్న ఈ అమ్మాయిని తమ సినిమాలోకి తీసుకోమంటూ కొంతమంది హీరోల వైపు నుంచి దర్శక నిర్మాతలపై వత్తిడి పెరుగుతోందట. దాంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మాయి డేట్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని టాక్. ఇక ఈ అమ్మాయి రెండవ సినిమాగా అఖిల్ 'మిస్టర్ మజ్ను' రానుంది. ఆ సినిమా కనుక హిట్ కొట్టిందంటే టాలీవుడ్లో ఈ సుందరి జోరు పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.