కార్తీ 'దేవ్' నుంచి ఫస్టు టీజర్ వస్తోంది!
- కార్తీ కథానాయకుడిగా 'దేవ్'
- ఈ నెల 5వ తేదీన టీజర్ రిలీజ్
- డిసెంబర్లో సినిమా విడుదల
ఈ యాక్షన్ డ్రామాలో రకుల్ .. నిక్కీ గల్రాని కథానాయికలుగా నటించారు. హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. జయసుధ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, తనకి మంచి పేరు తీసుకొస్తుందని కార్తీ చెబుతున్నాడు. ఈ సినిమాకి ముందు కార్తీతో కలిసి రకుల్ చేసిన 'ఖాకీ' విజయాన్ని సాధించింది. అలాగే ఈ సినిమా కూడా హిట్ కొడుతుందేమో చూడాలి.