ఎన్టీఆర్ బయోపిక్ లో దర్శకుడు వినాయక్
- దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో క్రిష్
- విఠలాచార్య పాత్రలో ఎన్.శంకర్
- దాసరి పాత్రలో వీవీ వినాయక్
దాసరి నారాయణరావు .. ఎన్టీ రామారావు కాంబినేషన్లో వచ్చిన 'సర్దార్ పాపారాయుడు' .. 'బొబ్బిలి పులి' .. 'విశ్వరూపం' సంచలన విజయాలను సాధించాయి. అందువలన ఎన్టీఆర్ బయోపిక్ లో దాసరి నారాయణరావు పాత్రను చూపించవలసిన అవసరం వుంది. ఈ పాత్రకి గాను వినాయక్ అయితే బాగుంటుందని భావించి, ఆయనను ఒప్పించినట్టు తెలుస్తోంది. త్వరలోనే దాసరి పాత్రకి సంబంధించిన సన్నివేశాలను వినాయక్ పై చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు.