'సవ్యసాచి' విషయంలో ముందుగా భయపడ్డాను: చైతూ
- స్టోరీ లైన్ చెప్పనప్పుడు భయపడ్డాను
- పూర్తి కథ విన్నాక నమ్మకం కలిగింది
- నా కెరియర్లో చెప్పుకోదగినది అవుతుంది
నా పరిస్థితిని అర్థం చేసుకున్న చందూ మొండేటి, పూర్తి కథను సిద్ధం చేసుకుని వచ్చి వినిపించాడు. ఆడియన్స్ కి ఈ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమవుతుందని అనిపించి అంగీకరించాను. కానీ అవుట్ ఫుట్ అనుకున్న విధంగా వస్తుందో లేదో అనే విషయంలో టెన్షన్ పడ్డాను. ఒకటి .. రెండు షెడ్యూల్స్ పూర్తయిన తరువాత నాకు ఈ సినిమాపై నమ్మకం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఈ సినిమా నా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని తప్పక చెప్పగలను" అనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు.