'సవ్యసాచి' విషయంలో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
- ఓ ఆర్టికల్ నుంచి ఈ కథ పుట్టింది
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేశాను
- అన్ని వర్గాలవారికి నచ్చుతుంది
కొన్ని సంవత్సరాల క్రితం 'వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్' గురించిన ఒక ఆర్టికల్ చదివాను. ఈ రకమైన సిండ్రోమ్ కలిగినవారికి ఒక చేయి అదుపులో ఉండదు. ఇది నాకు కాస్త చిత్రంగా అనిపించింది. ఈ పాయింట్ పై సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది. వెంటనే కథను రెడీ చేసుకుని వెళ్లి, చైతూతో పాటు నిర్మాతలకి వినిపించాను. అందరికీ నచ్చడంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ ప్రధాన అంశాలుగానే ఈ కొత్త కాన్సెప్ట్ ను తీర్చిదిద్దాను. అన్నివర్గాల వారికి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.