త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లనున్న బన్నీ
- 'అరవింద'తో హిట్ కొట్టిన త్రివిక్రమ్
- తదుపరి సినిమా బన్నీతో
- డిసెంబర్లో పూజా కార్యక్రమాలు
ఆల్రెడీ ఆయనకి త్రివిక్రమ్ ఒక కథ వినిపించాడనీ .. అది ఒక హిందీ సినిమాకి రీమేక్ అనే వార్తలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం బన్నీకి కొత్తగా ఒక లైన్ వినిపించి ఓకే అనిపించేసుకున్నాడట. ప్రస్తుతం పూర్తి కథను సిద్ధం చేసే పనిలో వున్నాడని అంటున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.