'సవ్యసాచి' నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది
- విభిన్నమైన కంటెంట్ తో సినిమా
- ఈ నెల 24న ట్రైలర్
- వచ్చేనెల 2న సినిమా రిలీజ్
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మరింత హైప్ తీసుకురావడానికిగాను, ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, మాధవన్ ప్రతినాయకుడిగా నటించాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అంటున్నారు. ఈ సినిమా అయినా చైతూకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.