ఎన్టీఆర్ రావడంతోనే సెట్ లో పరిస్థితి మారిపోయేది: త్రివిక్రమ్
- ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా వుంటారు
- అందరూ హుషారుగా పనిచేసేవారు
- అనుకున్న సమయానికి పూర్తి చేశాము
"మరుసటి రోజు షూటింగ్ వుంటే 'మేకప్ తో అయితే ఎన్ని గంటలకి రావాలి? మేకప్ లేకుండా అయితే ఎంత ముందుగా రావాలి?' అని ఎన్టీఆర్ అడిగేవారు. ఒక స్టార్ హీరో అలా అడగడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. ఎన్టీఆర్ సెట్లో అడుగుపెట్టగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయేది. ఆయనలోని ఉత్సాహం కారణంగా .. సెట్ లోని వాళ్లంతా మరింత హుషారుగా పనిచేసేవాళ్లు. ఆయన సెట్లో వున్నంత వరకూ ఎవరిలోనూ నిరుత్సాహం .. అలసత్వం కనిపించేది కాదు. ఆయన స్పీడ్ ను అందుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించడం వలన, అనుకున్న సమయానికి షూటింగు పూర్తయింది" అని చెప్పుకొచ్చారు.