'మిస్టర్ మజ్ను' సంక్రాంతి బరిలోకి దిగేస్తాడట!
- వెంకీ అట్లూరి నుంచి 'మిస్టర్ మజ్ను'
- ప్లే బాయ్ పాత్రలో అఖిల్
- ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్
ఈ సినిమాను జనవరి 26వ తేదీన విడుదల చేసే ఆలోచనలో టీమ్ వున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే యూత్ నుంచి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసిన తరువాత, సంక్రాంతికి రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఇప్పటికే సంక్రాంతి బరిలో 'ఎన్టీఆర్' బయోపిక్ .. చరణ్ - బోయపాటి మూవీ .. 'ఎఫ్ 2' సినిమాలు వున్నాయి. అయినా పండుగ రోజుల్లోనే రావడానికి 'మిస్టర్ మజ్ను' ఉత్సాహాన్ని చూపుతున్నాడట. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.