'మిస్టర్ మజ్ను' ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే!
- ముగింపు దశలో 'మిస్టర్ మజ్ను'
- రేపు రిలీజ్ కానున్న ఫస్టులుక్
- జనవరి 26వ తేదీన సినిమా విడుదల
ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమయంలో రంగంలోకి దిగడానికి చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. అందువలన జనవరి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నట్టుగా సమాచారం. గతంలో తను నటించిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన, ఈ సినిమాపైనే అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు.