కులమతాలకు అతీతంగా పిల్లలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత పెద్దలదే!: ప్రణయ్ హత్యపై చంద్రబాబు
- అహంభావంతో మనుషులను చంపే స్థితికి రావడం ఆందోళనకరం
- ఇష్టం లేకపోతే, వారి మానాన వారిని వదిలేయాలి
- హత్య చేయించడం వల్ల ఆ అమ్మాయి తండ్రి సాధించిందేమీ లేదు
తక్కువ కులం ఉన్న వ్యక్తిని కూతురు పెళ్లి చేసుకుందనే ఉద్దేశంతో ఆమె భర్తను కన్న తండ్రే చంపించాడంటే... ఈ సమాజంలో ఎంతటి అహంకారం ఉందో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. అబ్బాయి మంచివాడు అయినప్పుడు, అమ్మాయికి నచ్చినప్పుడు, పెళ్లి చేసుకుని వారిద్దరూ సంతోషంగా ఉంటారని భావించినప్పుడు... తల్లిదండ్రులు వారికి పెళ్లి చేసి, ఆశీర్వదించాలని చెప్పారు. ఒకవేళ ఇష్టం లేకపోతే, వారి మానాన వారిని వదిలేయాలని... ఇలా దారుణంగా హతమార్చడం అనాగరిక చర్య అని అన్నారు. ఈ హత్య వల్ల అమ్మాయి తండ్రి సాధించింది ఏమీ లేదని అన్నారు.