అఖిల్ మూవీలో కీలకమైన రోల్ లో కాజల్?
- వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను'
- అఖిల్ సరసన నిధి అగర్వాల్
- డిసెంబర్లో రిలీజ్ చేసే ఆలోచన
నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో కాజల్ ఒక కీలకమైన రోల్ చేస్తోందనేది తాజా సమాచారం. ఆడియన్స్ ను థ్రిల్ చేయడం కోసం ఈ విషయాన్ని యూనిట్ వారు సీక్రెట్ గా వుంచినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్ ఏమై ఉంటుంది? ఆమె పాత్రను వెంకీ అట్లూరి ఎలా డిజైన్ చేసి ఉంటాడు? అనేది ఆసక్తిని రేకెత్తించే విషయమే. 'మిస్టర్ మజ్ను' టైటిల్ తో ఈ సినిమాను డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు.