nayanatara: ఆలస్యంగా థియేటర్లకు నయన్ మూవీ .. నిరాశచెందిన అభిమానులు
- నయన్ తాజా చిత్రంగా 'ఇమైక్కా నోడిగళ్'
- నిన్ననే తమిళనాట విడుదల
- పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిన నయన్
నయనతార ప్రధానమైన పాత్రను పోషించిన 'కొలమావు కోకిలా' తమిళనాట విజయవిహారం చేస్తోంది. ఈ నెల 17వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలోనే నయనతార మరో చిత్రమైన 'ఇమైక్కా నోడిగళ్' నిన్న థియేటర్స్ కి వచ్చింది. నయనతార .. రాశి ఖన్నా .. అధర్వ మురళి .. అనురాగ్ కాశ్యప్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తూ వచ్చారు.
అయితే నిర్మాతలకి .. డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఆర్థికపరమైన లావాదేవీల్లో సమస్య కారణంగా, నిన్న ఈ సినిమా మొదటి రెండు ఆటలను రద్దు చేశారు. ఆ తరువాత ఈ సినిమా థియేటర్స్ కు వచ్చింది. ఆలస్యమైనా తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చేసుకుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నయనతార ఎక్కువ మార్కులు కొట్టేసింది. సాధారణంగా నయనతారకి గల క్రేజ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. అయితే ఆలస్యంగా ఈ సినిమా థియేటర్స్ కి రావడం వలన ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం పడింది. దాంతో నయన్ అభిమానులు నిరాశ చెందారు.