Arya-2: 'ఉప్పెనంత ఈ ప్రేమకీ...' అని బన్నీ అంటుంటే డ్యాన్స్ చేసిన స్నేహ!
- మిత్రుడి వివాహానికి భార్యతో సహా వెళ్లిన అల్లు అర్జున్
- డ్యాన్సులు చేస్తూ సందడి చేసిన జంట
- పాటలు పాడిన నాని
సెట్లోనూ, సెట్ బయటా ఎంతో ఎనర్జీతో కనిపించే అల్లు అర్జున్, ఓ స్నేహితుడి వివాహ వేడుకకు, తన భార్య స్నేహతో సహా హాజరై, చాలా సందడి చేశాడట. బన్నీ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'ఆర్య-2' చిత్రంలో "ఉప్పెనంత ఈ ప్రేమకీ..." పాటను స్టేజ్ పై పాడుతుండగా, స్నేహ డ్యాన్స్ చేసిందట. ఇక ఇదే వివాహానికి హాజరైన నాని కూడా హంగామా చేశాడట. నాగ్ కెరీర్ లోని ఆల్ టైమ్ బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచే, "ఎటో వెళ్లిపోయింది మనసు" తో పాటు, క్లాసికల్ మూవీ 'గురు'లోని "ప్రియతమా నీవచట కుశలమా' పాటను బన్నీ, నాని కలిసి పాడారట. ఈ విశేషాలను అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నాడు.