అల్లు అరవింద్ చేతికి 'పేపర్ బాయ్'!
- దర్శకుడిగా సంపత్ నందికి మంచి పేరు
- నిర్మాతగా రెండవ సినిమా
- ఈ నెల 31న 'పేపర్ బాయ్' రిలీజ్
ఒక పేపర్ బాయ్ కి శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఈ సినిమాలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉందట .. ఆ ట్విస్ట్ నచ్చడం వల్లనే దీనిని విడుదల చేయడానికి అల్లు అరవింద్ ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. 'రచ్చ' సినిమా నుంచి అల్లు అరవింద్ తో సంపత్ నందికి మంచి సాన్నిహిత్యం వుంది. ఆ కారణంగానే సంపత్ నంది ఆయనని కలవడం .. కంటెంట్ లో కొత్తదనం ఉండటంతో ఈ సినిమాను పంపిణీ చేయడానికి అల్లు అరవింద్ ముందుకు వచ్చారట. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది.