కేన్సర్ అని తెలియగానే తాతగారు నన్ను పిలిచి ఆ మాట చెప్పారు: సుప్రియ
- 'మనం' చేయాలని అనుకున్నాము
- అప్పుడు తాతగారు బాగానే వున్నారు
- ఆ తరువాతే కేన్సర్ అని తెలిసింది
ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసిన తరువాత ఆయనకి వంట్లో కాస్త నలతగా అనిపించింది. అప్పుడు ఆయనని హాస్పిటల్ కి తీసుకెళ్లాము. డాక్టర్లు ఆయనని చూసి వెళ్లిన తరువాత ఏదో బ్యాడ్ న్యూస్ వినబోతున్నామనే మాకు అనిపించింది. అంతలో తాతగారు నన్ను లోపలికి పిలిచారు. 'ఇంకా నాకు ఎన్ని రోజుల షూటింగ్ వుంది? .. నేను ఎప్పుడూ కూడా ఏ సినిమాను పూర్తిచేయకుండా వదల్లేదు .. తొందరగా షూటింగ్ పెట్టు' అన్నారు. ఆ తరువాత పెద్ద మావయ్యను పిలిచి అదే మాట చెప్పారు. ఆయన కోరిక మేరకే ఇంట్లోనే డబ్బింగ్ కి ఏర్పాటు చేశాము' అంటూ ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.