దిల్ రాజు .. సతీశ్ వేగేశ్న కాంబినేషన్లో 'థ్యాంక్యూ '
- దిల్ రాజు .. సతీశ్ ల 'శతమానం భవతి'
- రెండో సినిమాగా 'శ్రీనివాస కళ్యాణం'
- మూడవ సినిమాకి సన్నాహాలు
ఈ నేపథ్యంలో తమ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందనే విషయాన్ని తాజాగా దిల్ రాజు చెప్పారు. "ఇటీవల నేను విన్న ఒక కథను సతీశ్ వేగేశ్నకి చెప్పాను .. ఆయన రెండో ఆలోచన లేకుండా చేద్దాం అన్నారు. యూత్ కి నచ్చే అన్ని అరకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఈ సినిమా టైటిల్ 'థ్యాంక్యూ' .. 'మీకు ఎలా చెప్పాలో' అనేది ఉపశీర్షిక. త్వరలోనే ఈ కథకు పూర్తి రూపాన్ని తీసుకొచ్చి సెట్స్ పైకి వెళతాం" అన్నారు. మొత్తానికి రెండో సినిమా థియేటర్లలో ఉండగానే మూడో సినిమాకి సన్నాహాలు మొదలెట్టేశారన్న మాట.