నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ కి సంబంధించిన స్టిల్స్‌ను తాజాగా విడుదల చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయనున్నారు.