అఖిల్ మూవీకి 'మిస్టర్ మజ్ను' టైటిల్ ఖరారు!
- వెంకీ అట్లూరితో అఖిల్
- ప్రస్తుతం లండన్ లో షూటింగ్
- డిసెంబర్లో విడుదలకు సన్నాహాలు
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేశారనీ .. రిజిస్టర్ కూడా చేయించారనేది తాజా సమాచారం. ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. నిధి అగర్వాల్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.