హీరోను చేస్తామని చెప్పి చాలామంది మోసం చేశారు: 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ
- చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం
- హీరో కావాలని నటనలో శిక్షణ తీసుకున్నాను
- చాలామంది తిప్పించుకున్నారు
"చిన్నప్పటి నుంచి నాకు సినిమాల పిచ్చి ఎక్కువ .. చిరంజీవి గారంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. 'ఇంద్ర' సినిమా ఎన్నిసార్లు చూశానో .. ఆయన డాన్సులను ఎన్నిమార్లు ప్రాక్టీస్ చేశానో లెక్కేలేదు. సినిమాల్లోకి వెళతానంటూ అమ్మా నాన్నలను ఒప్పించి, నటనలో శిక్షణ తీసుకున్నాను. ఏ సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నా అక్కడికి వెళ్లేవాడిని. అదిగో మొదలవుతుంది .. ఇదిగో మొదలవుతుంది అంటూ చాలామంది నన్ను తిప్పుకున్నారు.
అంతా రెడీ .. ఒక లక్ష రూపాయలుంటే సినిమా మొదలైపోతుందని అంటే .. వెంటనే తెచ్చి ఇచ్చేవాడిని. కానీ ఆ సినిమా మొదలయ్యేది కాదు. ఇలా చాలామంది మోసం చేశారు. ఆ తరువాత దర్శకుడు అజయ్ పరిచయం కావడం .. నేను హీరోగా మీ ముందుకు రావడం జరిగింది. అనుకున్నట్టుగానే హీరో అయినందుకు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా వుంది" అంటూ చెప్పుకొచ్చాడు.