'సవ్యసాచి' విడుదల తేదీ ఖరారైపోయింది
- చందూ మొండేటి దర్శకుడిగా 'సవ్యసాచి'
- చైతూ జోడీగా నిధి అగర్వాల్
- కీలక పాత్రలో భూమిక
ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఆగస్టు 17వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చేశారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, ఆయన అక్క పాత్రలో భూమిక కనిపించనుంది. గతంలో చందూ .. చైతూ కలిసి చేసిన 'ప్రేమమ్' ఘన విజయాన్ని సాధించడం వలన, ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మరి.