ఆసక్తిని రేపుతోన్న 'ఇదం జగత్' .. ఫస్టులుక్ రిలీజ్
- సుమంత్ హీరోగా 'ఇదం జగత్'
- మరింత హ్యాండ్సమ్ గా సుమంత్
- దర్శకుడిగా అనిల్ శ్రీకంఠం
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. రాత్రివేళలో సిటీలోని ఓ రోడ్డుపై కెమెరా పట్టుకుని సుమంత్ కనిపిస్తున్నాడు. ఓ మరణానికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఆయన ఉన్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. అలా ఈ పోస్టర్ అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో సుమంత్ మరింత హ్యాండ్సమ్ గా కనిపించనున్నాడనేది ఈ పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమా అయినా సుమంత్ కి సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.