'చినబాబు'గా రానున్న కార్తీ .. ఆడియో వేదిక ఖరారు
- కార్తీ కథానాయకుడిగా 'చినబాబు'
- రైతుల సమస్యలపై పోరాటం
- కథానాయికగా సాయేషా సైగల్
ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా సాయేషా సైగల్ నటిస్తోంది. ఈ సినిమాకి డి.ఇమాన్ సంగీతాన్ని సమకూర్చాడు. తెలుగులో ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 23వ తేదీ సాయంత్రం జరపనున్నారు. వైజాగ్ లోని 'సీఆర్ రెడ్డి కాన్వోకేషన్ హాల్' లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోన్న సూర్య ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.