'బాహుబలి'కి వర్క్ చేసిన టీమ్ తో 'సవ్యసాచి' విజువల్ ఎఫెక్ట్స్ పనులు
- చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
- చైతూ జోడీగా నిధి అగర్వాల్
- హైలైట్ గా మాధవన్ విలనిజం
గతంలో 'బాహుబలి' సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ను అందించిన 'మకుట' సంస్థవారే ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ను అందిస్తుండటం విశేషం. కథ .. కథనాలతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తాయని అంటున్నారు. చైతూ నటన.. మాధవన్ విలనిజం .. హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.