22 రోజుల్లో 10 లక్షల ఫోన్ల విక్రయాలు... దూసుకుపోతున్న వన్ ప్లస్ 6
- ఛైనాలో దీనికి అత్యధిక స్పందన
- చాలా వేగంగా అమ్ముడవుతున్న ఫోన్ గా రికార్డు
- గత నెలలోనే విడుదలైన ఫోన్
తమ అంచనాలను వన్ ప్లస్ 6 అధిగమించిందని, అత్యద్భుత స్పందనకు ధన్యవాదాలని కంపెనీ సీఈవో పెటే లూ పేర్కొన్నారు. అత్యంత వేగంగా అమ్ముడుపోయే ఫోన్ ఇదే కావడం గమనార్హం. వన్ ప్లస్ 6 కంటే ముందు వన్ ప్లస్ 5, 5టీ మోడల్ ఫోన్లు 10 లక్షలు అమ్ముడుపోవడానికి మూడు నెలల సమయం పట్టగా, వన్ ప్లస్ 6కు 22 రోజులు సరిపోయింది. వన్ ప్లస్ 6 మన దేశంలో రూ.34,999 ధరకు అమ్ముడవుతోంది. ఇది 6జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర. 8జీబీ ర్యామ్, 128 జీబీ వెర్షన్ స్టోరేజీ ధర రూ.39,999.