తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది' ట్రైలర్ విడుదల
- సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సినిమా
- హైదరాబాద్ యాసలో డైలాగులు
- నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ..
'మనం కూడా ఈ సాయంత్రం మధ్యపానంలో మునిగి తేలాల్సిందే' అంటూ ఈ ట్రైలర్‌లో ఓ డైలాగ్ వదిలారు. అలాగే, 'ఈరోజు ఆఫీస్‌కి ఎందుకుపోలే' అని ఒకరు అడగగా, 'నాగుల పంచమి ఇయ్యాల' అని ఓ నటుడు సమాధానం ఇస్తున్నాడు.
ఈ సినిమా ట్రైలర్‌పై సినీనటుడు నాని స్పందిస్తూ... ఈ మధ్యకాలంలో తాను చూసిన ట్రైలర్‌లలో చాలా సహజంగా, ఫన్‌గా ఉన్న ట్రైలర్ ఇదేనని అన్నాడు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు.