సన్నబడిన హన్సిక .. తెలుగు సినిమాల్లో అవకాశాలపై ఆసక్తి
- కోలీవుడ్ లో అగ్రనాయిక అనిపించుకున్న హన్సిక
- ఈ మధ్య కాలంలో పలకరించని సక్సెస్ లు
- జోరు తగ్గడంతో టాలీవుడ్ వైపు చూపులు
హన్సిక బొద్దుగా ఉండటం వలన .. ఆ కారణంగా ఆమె తమిళంలో బిజీ కావడం వలన అడపాదడపా మాత్రమే తెలుగు సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్య తమిళంలోను ఆమెకి చెప్పుకోదగిన హిట్లు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్ కి వచ్చిన హన్సికను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎప్పటి నుంచి కసరత్తులు మొదలెట్టిందోగానీ ఆమె చాలా సన్నబడింది. తమిళంలో జోరు తగ్గడంతో తెలుగు సినిమాల్లో అవకాశాల కోసమే ఆమె సన్నబడిందనే టాక్ కూడా వినిపిస్తోంది. కారణమేదైనా హన్సిక చేసిన ప్రయత్నం ఫలించి .. తెలుగు సినిమాల్లో ఆమెకి ఛాన్సులు వస్తాయేమో చూడాలి.