తమిళ అమ్మాయినైనా తెలుగులోనే మంచి గుర్తింపు వచ్చింది: నటి సుధ
- మాది తమిళనాడులోని శ్రీరంగం
- అక్కడ మంచి గుర్తింపు రాలేదు
- తెలుగులో నా మొదటి సినిమా 'తల్లిదండ్రులు'
తెలుగులో బాలకృష్ణ హీరోగా చేసిన 'తల్లిదండ్రులు' సినిమాలో మొదటి అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నేను చేసిన వదిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. 'గ్యాంగ్ లీడర్' లో వేసిన విడో పాత్ర తరువాత వైట్ శారీ కట్టుకుని ఎప్పుడూ ఏడుస్తూ కూర్చునే పాత్రలే వచ్చాయి. ఈ ముద్ర నుంచి బయటపడటం ఎలాగా అని ఆలోచిస్తోన్న సమయంలోనే, ఈవీవీ సత్యనారాయణగారు 'ఆమె' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. నటిగా నాకు ఆ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది' అని చెప్పుకొచ్చారు.