'భరత్ అనే నేను' సినిమాపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు!
- నవోదయం పార్టీ అధ్యక్షుడి ఫిర్యాదు
- తమ పార్టీని కించపరిచేలా చూపించారంటూ ఆరోపణ
- తగిన చర్యలు తీసుకోవాలంటూ వినతి
అనంతరం మీడియాతో నల్లకరాజు మాట్లాడుతూ, తమ పార్టీ జెండాలో ఉన్న ఉదయించే సూర్యుడి గుర్తును, నవోదయం అనే తమ పార్టీ పేరును సినిమాలో పలుమార్లు చూపిస్తూ, అప్రజాస్వామికమైన పదజాలాన్ని వాడారని మండిపడ్డారు. తమ పార్టీ లక్ష్యాలకు వ్యతిరేకమైన మాటలను చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. నవోదయం పార్టీ తరపున ఈ చిత్రంపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు.