అఖిల్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్!
- వెంకీ అట్లూరితో అఖిల్ మూవీ
- కథానాయికగా నిధి అగర్వాల్
- లండన్ లో తొలి షెడ్యూల్
ప్రస్తుతం నాగచైతన్య సరసన 'సవ్యసాచి' చేస్తోన్న నిధి అగర్వాల్, ఆ తరువాత సినిమాను అఖిల్ తో చేయనుండటం విశేషం. ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ఖరారైపోవచ్చునని అంటున్నారు. గతంలో నాగార్జున చేసిన 'హలో బ్రదర్' నుంచి 'హలో' టైటిల్ తీసిన అఖిల్, ఈ సారి కూడా నాగార్జున హిట్ మూవీ అయిన 'మజ్ను' టైటిల్ ను తీసుకుని దానికి ముందు మిస్టర్ ను కలుపుకున్నాడు. వచ్చేనెల రెండవ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.