ఎన్టీఆర్ మూవీలో మరో హీరోయిన్ గా అచ్చ తెలుగు అమ్మాయి!
- ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ
- రాయలసీమ నేపథ్యంలో సాగే కథ
- ఒక కథానాయికగా పూజా హెగ్డే
కథ ప్రకారం మరో హీరోయిన్ కూడా అవసరం కావడంతో, తెలుగు బాగా మాట్లాడే హీరోయిన్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావించారట. ఆ సమయంలోనే ఆయనకి 'అమీ తుమీ 'లో చేసిన తెలుగమ్మాయి 'ఈషా రెబ్బా' గుర్తుకు వచ్చిందట. అంతే, ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో ఈషా పాత్ర కొత్తగా వుండి .. ఆమె నటనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తుందని అంటున్నారు. త్రివిక్రమ్ మూవీలో .. అందునా ఎన్టీఆర్ సరసన ఛాన్స్ తగలడంతో ఈషా రెబ్బా ఆనందంతో పొంగిపోతోందట.