తమిళనాట 'భరత్' అదరగొట్టేశాడు
- కొరటాల దర్శకత్వంలో 'భరత్ అనే నేను'
- మహేశ్ సరసన కైరా అద్వాని
- తమిళనాట భారీ వసూళ్లు
తెలుగు వెర్షన్ అక్కడ 4.2 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం చెప్పుకోదగిన విషయం. తెలుగు వెర్షన్ లో ఇంతవరకూ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సినిమాతో అక్కడ మహేశ్ బాబు క్రేజ్ మరింతగా పెరిగిపోయిందనీ, భవిష్యత్తులో అక్కడ ఆయన సినిమాలు ఇతర హీరోల సినిమాలకి గట్టిపోటీ ఇస్తాయనడంలో సందేహం లేదని చెప్పుకుంటున్నారు. 'స్పైడర్'తో గట్టిగా ప్రయత్నించిన మహేశ్ బాబు, ఈ సినిమాతో తమిళంలో తన మార్కెట్ ను పెంచుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకుంటున్నారు.