అఖిల్ కి జోడీగా నిధి అగర్వాల్ కి ఛాన్స్!
- 'తొలిప్రేమ'తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి
- హీరోగా అక్కినేని అఖిల్
- యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథాంశం
ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలనే విషయంలో చాలామంది పేర్లను పరిశీలించారు. తాజాగా నిధి అగర్వాల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఆమెపై టెస్ట్ కట్ చేసిన తరువాతనే ఓకే చేశారట. అఖిల్ మూవీలోని పాత్రకి ఈ అమ్మాయి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. నిధి అగర్వాల్ ప్రస్తుతం చైతూ సరసన 'సవ్యసాచి' సినిమా చేస్తోంది. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే, అఖిల్ మూవీలో ఆమెకి అవకాశం దొరకడం విశేషం.