'నా పేరు సూర్య' నుంచి మరో పాటకి ముహూర్తం కుదిరింది
- 'నా పేరు సూర్య'గా బన్నీ
- ఈ నెల 13న 3వ పాట రిలీజ్
- మే 4వ తేదీన సినిమా విడుదల
విశాల్ - శేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక 'బ్యూటీ ఫుల్ లవ్' అంటూ సాగే మూడవ పాటను ఈ నెల 13వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ పాటతో సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం జరుగుతుందని భావిస్తున్నారు. బన్నీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిపోవడం ఖాయమని అంటున్నారు.