మహేశ్ మూవీ నుంచి మరో సాంగ్ .. దుమ్ము రేపేస్తోంది!
- 'భరత్ అనే నేను' నుంచి మూడవ పాట
- ఉత్తేజపరుస్తోన్న రామజోగయ్య శాస్త్రి సాహిత్యం
- హుషారెత్తిస్తోన్న దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
మహేశ్ ను ఉద్దేశిస్తూ జనం పాడుకునే పాటగా అనిపిస్తోంది. ఆ జనంలో ఒకడై మహేశ్ కూడా చిందేస్తాడనే విషయం పోస్టర్స్ ద్వారా అర్థమవుతోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది .. జనంలోకి వెళ్లేలా .. జనం నాల్కులపై ఆడేలా వుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ పాటకి మరింత ఊపును తీసుకొచ్చిందనే చెప్పాలి. కష్టంలోని సుఖాన్ని .. కలిసి బతకడంలోని ఆనందాన్ని ఆవిష్కరించేలా వున్న ఈ పాటకి నూటికి నూరు మార్కులు పడిపోతాయని చెప్పొచ్చు.