నాకు తెలిసిన విషయాన్ని సూటిగా చెప్పాను: నటుడు శివాజీ
- ప్రజలను అప్రమత్తం చేయడానికే ‘ఆపరేషన్ గరుడ’ బయటపెట్టా
- ఇంత కీలకమైన సమాచారాన్ని ఏడాది క్రితమే సేకరించా
- బీజేపీ కుట్ర గురించి బయటపెడితే.. టీడీపీ వాడినంటూ ముద్ర వేస్తున్నారు
నేను బీజేపీ కుట్ర గురించి బయటపెడితే.. టీడీపీ వాడినంటూ నాపై ముద్ర వేస్తున్నారు. నాకు ఏ పార్టీలు, పదవులు వద్దు. నా అస్థిత్వం కోసం నేనేమీ పాకులాడట్లేదు. నాపై వస్తున్న విమర్శలను పట్టించుకోను. నాకు సినిమాలు లేకపోవడంతోనే ఇదంతా చేస్తున్నానని విమర్శిస్తున్నారు. నా చివరి సినిమా 'బూచమ్మ బూచోడు'. ఈ సినిమా హిట్ అయింది. నేనేమీ ఫెయిల్యూర్ నటుడిగా బయటకు రాలేదు. ఇప్పటివరకు 90 సినిమాల్లో నటించాను’ అని చెప్పుకొచ్చారు.