చైతూ కోసం వెయిటింగ్ ఇక్కడ: దర్శకుడు మారుతి
- 'శైలజా రెడ్డి అల్లుడు' ఫస్టు షెడ్యూల్ పూర్తి
- రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు
- 'సవ్యసాచి' షూటింగులో బిజీగా చైతూ
ఈ నేపథ్యంలో మారుతి స్పందిస్తూ .. "అందరూ చైతూ మూవీ గురించి అడుగుతున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది.. రెండవ షెడ్యూల్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. 'సవ్యసాచి' సినిమా పనుల్లో చైతూ బిజీగా ఉండటమే ఈ ఆలస్యానికి కారణం. నేను మీలాగే ఆయన కోసం వెయిటింగులో వున్నాను. ఈ సినిమా ఫస్టులుక్ ను మే నెలలో రిలీజ్ చేసే అవకాశాలు వున్నాయి. అప్పటివరకూ వెయిట్ చేయండి బ్రదర్స్ " అంటూ ట్వీట్ చేశాడు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.