మాళవిక శర్మకి బంపరాఫర్ .. రామ్ జోడీగా ఛాన్స్
- ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్
- కథానాయికగా మాళవిక శర్మ ఎంపిక
- ఆల్రెడీ 'నేల టిక్కెట్టు' చేస్తోన్న మాళవిక
హీరో రామ్ తో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించారు. చివరిగా మాళవిక శర్మను తీసుకున్నట్టు సమాచారం. మరికొంతమంది దర్శక నిర్మాతలు కూడా మాళవిక శర్మ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారట. చూస్తుంటే ఈ అమ్మాయి జోరు కొనసాగేలానే కనిపిస్తోంది. రామ్ ను డిఫరెంట్ గా చూపిస్తూ ప్రవీణ్ సత్తారు రూపొందించనున్న ఈ సినిమాకి, ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.