'జై సింహా' దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ .. మాఫియా డాన్ గా బాలకృష్ణ
- కన్నడలో హిట్ కొట్టిన 'మఫ్టీ'
- తెలుగు రీమేక్ లో బాలకృష్ణ
- దర్శకుడిగా కె.ఎస్.రవికుమార్
ఇంతకుముందు బాలకృష్ణతో 'జై సింహా' చేసిన ఆయన .. రీసెంట్ గా బాలకృష్ణను కలిసి 'మఫ్టీ' కథ చెప్పారట. ఇంకా ఈ కథపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. బాలకృష్ణ పుట్టినరోజైన జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయకుడు మాఫియా డాన్ గా కనిపిస్తాడట. ఈ పాత్ర స్వభావం కొత్తగా ఉండటంతో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.