అమెరికాలో బన్నీ రొమాంటిక్ సాంగ్
- ముగింపు దశలో 'నా పేరు సూర్య'
- కీలక పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్,శరత్ కుమార్
- ఏప్రిల్ రెండవ వారంలో ఆడియో రిలీజ్
అల్లు అర్జున్ .. అనూ ఇమాన్యుయెల్ పై అమెరికాలో రేపటి నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ .. శరత్ కుమార్ ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ రెండవ వారంలో ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించి, తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఒకే రోజున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.