సారీ బాబాయ్! నువ్వెన్నిసార్లు పిలిచినా రాలేకపోయాను: అల్లరి నరేష్ తో కల్యాణ్ రామ్
- అల్లరి నరేష్ కు సారీ చెప్పిన కల్యాణ్ రామ్
- ‘ఎమ్ఎల్ఏ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అల్లరి నరేష్
- నరేష్ తరువాతి ఆడియో ఫంక్షన్ కి వెళ్తానన్న కల్యాణ్ రామ్
ఫిల్మ్ నగర్ లో తన ఆఫీస్, అల్లరి నరేష్ ఆఫీస్ రెండూ పక్కపక్కనేనని ఉంటాయని చెప్పాడు. పెళ్లయ్యేంతవరకు తాను రోజూ నరేష్ ని కలిసేవాడినని అన్నాడు. పెళ్లి తరువాత తానే అతనిని కలవడం మానేశానని చెప్పాడు. నరేష్ సినిమా ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా ఫస్ట్ కాల్ తనకే వస్తుందని, అయితే తాను ఎప్పుడూ వెళ్లలేకపోయానని అన్నాడు. అయినా సరే దానిని మనసులో పెట్టుకోకుండా ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్ కి వచ్చి విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు. ఈ సారి నరేష్ సినిమా ఫంక్షన్ కు కచ్చితంగా వెళ్తానని చెప్పాడు.