'యమలీల'లో దివ్యభారతి నటించాల్సింది .. ఆమె నాకు మాట ఇచ్చింది: అలీ
- దివ్యభారతి మంచి అమ్మాయి
- నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేది
- ఆమె చేయాల్సిన పాత్ర ఇంద్రజ చేసింది
"తెలుగు డైలాగ్స్ విషయంలో నేను సాయం చేస్తుండటం వలన .. నాతో ఆమె చాలా స్నేహంగా ఉండేది. ఆమె ఎంతో కలివిడిగా ఉండటం వలన నేను 'దివ్య' అని పిలిచేవాడిని. 'నీకు హీరోగా ఛాన్స్ వస్తే నేను నీ జోడీగా నటిస్తాను' అంటూ నాకు మాట ఇచ్చింది. 'యమలీల' సినిమా మరికొన్ని రోజుల్లో మొదలవుతుందనగా ఆమె చనిపోయింది. దివ్యభారతి బతికుంటే ఆ సినిమాలో హీరోయిన్ గా ఆమే చేసేది. ఆమె చనిపోవడం వలన నా సరసన ఇంద్రజ చేసింది" అంటూ ఆనాటి సంగతులను అలీ గుర్తుచేసుకున్నాడు.